News August 5, 2024
ఏపీ వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారాలి: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రం వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం ఓ విధానాన్ని రూపొందించాలని, దీనిపై ఓ వర్క్ షాప్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ‘విద్యార్థులకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలను పెంచాలి. గతంలో న్యాక్ అక్రిడేషన్‌లో ఏపీ వర్సిటీలు టాప్-10లో ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కూడా లేకపోవడం శోచనీయం’ అని కలెక్టర్లతో మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News December 31, 2025
వారికి 16సార్లు న్యూ ఇయర్

అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములు 16సార్లు న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారు. గంటకు 28వేల కి.మీ. వేగంతో భూమి చుట్టూ తిరిగే ISS 90 నిమిషాల్లో ఎర్త్‌ని చుట్టేస్తుంది. అంటే రోజులో 16సార్లు భూమి చుట్టూ తిరుగుతూ 45 నిమిషాలకు ఓ పగలు, మరో 45ని.లకు రాత్రిని చూస్తారు. అలా న్యూ ఇయర్‌కూ వీరు 16సార్లు వెల్కమ్ చెబుతారన్నమాట. ప్రస్తుతం ISSలో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు.
News December 31, 2025
క్రికెట్.. 2025లో టాప్-5 ‘ఫస్ట్’ ఈవెంట్స్

☛ భారత మహిళల జట్టు ‘ఫస్ట్’ టైమ్ ODI WC గెలిచింది
☛ మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన ‘ఫస్ట్’ టీమ్‌గా IND మెన్స్ టీమ్ రికార్డు
☛ RCB ‘ఫస్ట్’ టైమ్ IPL టైటిల్ గెలిచింది
☛ టెస్ట్ క్రికెట్లో ‘ఫస్ట్’ టైమ్ ఒకే ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు (వెస్టిండీస్) డకౌట్ అయ్యారు. ఇందులో స్టార్క్(AUS) 15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీశారు.
☛ సౌతాఫ్రికాకు ఫస్ట్ ‘WTC’ టైటిల్ విజయం
News December 31, 2025
Ohh.. అప్పుడే క్వార్టర్ అయిపోయింది!

ఇది ఈ శతాబ్దంలో నేటితో ముగుస్తున్న క్వార్టర్ టైమ్ గురించి. 2001తో మొదలైన 21వ శతాబ్దంలో ఇవాళ్టితో పావు వంతు పూర్తయింది. మిలీనియం మొదట్లో చదువుకుంటున్న లేదా అప్పుడే నడక మొదలుపెట్టిన మనలో చాలామంది ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్తే.. ఈ ఇయర్ మాత్రమే కాదు 25 ఏళ్లు ఎంత ఫాస్ట్‌గా అయిపోయాయి అనిపిస్తుంది. ఇన్నేళ్ల జ్ఞాపకాలతో మరో కొత్త ఇయర్లోకి కొత్త ఆశలు, ఆశయాలతో అడుగుపెడదాం. Happy New Year.


