News October 3, 2024

నేటి నుంచి AP TET

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో (ఉ.9.30-మ.12, మ.2.30-సా.5) ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరిచేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 4.27లక్షల మంది హాజరు కానున్నారు.

Similar News

News November 4, 2024

వెలుగులోకి శతాబ్దాల నాటి నగరం!

image

మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో వందల ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన మాయా నాగరికతకు చెందిన నగరాన్ని సైంటిస్టులు గుర్తించారు. దీనికి వలేరియానా అని పేరు పెట్టారు. రాజధాని తరహాలో ఉన్న ఈ సిటీలో 6,674 రకాల కట్టడాలను గుర్తించారు. పిరమిడ్లు, కాజ్‌వేలు, డ్యామ్‌లు, బాల్ కోర్ట్, కొండలపై ఇళ్లు ఉన్నాయి. 50 వేల మంది నివసించి ఉండొచ్చని అంటున్నారు. లిడార్ అనే లేసర్ సర్వే ద్వారా దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు.

News November 4, 2024

పుష్ప-2 ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?

image

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ మధ్యలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. పుష్ప-2 డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.

News November 4, 2024

నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

* 1888: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం
* 1929: ప్రపంచ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం
* 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ పుట్టినరోజు
* 1964: దర్శకుడు, నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస రావు పుట్టినరోజు
* 1971: సినీనటి టబు పుట్టినరోజు(ఫొటోలో)