News October 6, 2024
ఏపీ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల
రాష్ట్రంలో జరుగుతున్న టెట్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్‌సైట్లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్‌కు అప్లై చేశారు. ఫైనల్ కీని అక్టోబర్ 27న, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.
వెబ్‌సైట్: <
Similar News
News November 10, 2024
మైనర్ బాలుడిని పెట్టి బెల్టు షాపు నడిపిస్తున్నారు: రోజా
AP: కాకినాడ(D) తొండంగి(M) ఆనూరులో మైనర్ బాలుడిని పెట్టి బెల్టు షాపు నడిపిస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ బెల్టు షాపు వైన్స్‌ను తలదన్నేలా ఉందన్నారు. ‘TDP మేధావి యనమల రామకృష్ణుడి సొంత మండలం, హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలో ఈ షాపు ఉంది. బెల్టు షాపు కనిపిస్తే బెల్టు తీస్తానన్న CM CBN కోసమే దీనిని పోస్ట్ చేశా. మంచి ప్రభుత్వమంటే ఇదేనా పవన్ కళ్యాణ్? సిగ్గుచేటు’ అని Xలో వీడియో పోస్ట్ చేశారు.
News November 10, 2024
భవన నిర్మాణాల అనుమతికి త్వరలో కొత్త విధానం: మంత్రి
AP: రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతికి త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్లు ప్లాన్ సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. నిర్మాణాలు ప్లాన్ ప్రకారమే ఉండాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అన్ని అనుమతులు/ఫీజుల చెల్లింపు ఆన్‌లైన్‌లోనే జరుగుతుందన్నారు. DECలోపు కొత్త విధానానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
News November 10, 2024
సౌదీ అరేబియాలో మెట్రో లోకో పైలట్‌గా తెలుగు మహిళ
HYD మెట్రో రైలు లోకో పైలట్ ఇందిర(33) అరుదైన ఘనత అందుకోనున్నారు. వచ్చే ఏడాది సౌదీలోని రియాద్‌లో ప్రారంభమయ్యే ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో సేవలు అందించనున్నారు. రైళ్లను నడపడం, స్టేషన్ల ఆపరేటింగ్‌లో ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మెట్రో ప్రాజెక్టుకు ఎంపిక చేసి ఐదేళ్ల పాటు శిక్షణ అందించారు. ఇప్పటికే ఆమె ట్రయల్ రైళ్లను నడుపుతున్నారు. తెలుగు బిడ్డగా ఈ ప్రాజెక్టులో భాగమవ్వడం గర్వంగా ఉందని ఇందిర చెప్పారు.