News December 19, 2024
ఏపీ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను 2024 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘దీపిక’ అనే సాహిత్య విమర్శా సంపుటికి ఈ గౌరవం దక్కింది. తెలుగుతో సహా 21 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ పురస్కార విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 8న ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
Similar News
News February 3, 2026
కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

TG: అనర్హత పిటిషన్‌పై విచారణకు హాజరు కావాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీచేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. అలాగే కడియంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ అందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కూడా నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.
News February 3, 2026
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – కట్టడికి సూచనలు

ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కేజీల మందును.. 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.
News February 3, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. కొన్ని గంటల క్రితం <<19036596>>తగ్గిన<<>> బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి ₹1,53,930కు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి ₹1,41,100కు చేరింది.


