News December 19, 2024

ఏపీ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

image

ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను 2024 ఏడాదికి గాను కేంద్ర సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రచించిన ‘దీపిక’ అనే సాహిత్య విమర్శా సంపుటికి ఈ గౌరవం దక్కింది. తెలుగుతో సహా 21 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ పురస్కార విజేతల పేర్లను అకాడమీ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 8న ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Similar News

News January 17, 2025

అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

image

AP: ఆక్రమణలకు గురైన అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. వీరు 15-10-2019 నాటికి దరఖాస్తు చేసుకుని ఉండాలని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో పలు కారణాలతో ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలను రద్దు చేస్తున్నామన్నారు. అలాంటి వారికి కోరుకున్న చోట ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు.

News January 17, 2025

దేశం గర్వించేలా మరింత కష్టపడతా: మనూ భాకర్

image

ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోవడంపై ఒలింపిక్ మెడలిస్ట్, భారత షూటర్ మనూ భాకర్ స్పందించారు. ‘గౌరవ రాష్ట్రపతి నుంచి ఖేల్ రత్న అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నా. ఈ గుర్తింపు నా దేశం గర్వపడేలా చేసేందుకు మరింత కష్టపడి పనిచేయడానికి, విజయాలు పొందేందుకు స్ఫూర్తినిస్తోంది. నాకు మద్దతునిచ్చిన, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

News January 17, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌కు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. AP అభివృద్ధి పట్ల NDAకి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు.