News September 26, 2024
మెడల్ పోగొట్టిందే కాకుండా వినేశ్ సారీ కూడా చెప్పలేదు: యోగేశ్వర్

డిస్క్వాలిఫై అయి దేశానికి ఒలింపిక్ మెడల్ పోగొట్టిన వినేశ్ ఫొగట్ సారీ చెప్పకుండా దానినో కుట్రగా చిత్రించారని మాజీ రెజ్లర్ యోగేశ్వర్ ఆరోపించారు. ‘రాజకీయాల్లో చేరడం వాళ్లిష్టం. బబితా, నేనూ BJPలో ఉన్నాం. వినేశ్ కాంగ్రెస్లో చేరారు. కానీ దేశానికి నిజం తెలియాలి. ఏడాదిగా జరిగిన ఘటనలు, ఒలింపిక్ డిస్క్వాలిఫికేషన్, పార్లమెంటు కొత్త భవనం వద్ద ఆందోళనతో భారత ఇమేజ్ను చెడుగా చిత్రించారు’ అని విమర్శించారు.
Similar News
News November 22, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్, సిఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.


