News September 26, 2024

మెడల్ పోగొట్టిందే కాకుండా వినేశ్ సారీ కూడా చెప్పలేదు: యోగేశ్వర్

image

డిస్‌క్వాలిఫై అయి దేశానికి ఒలింపిక్ మెడల్ పోగొట్టిన వినేశ్ ఫొగట్ సారీ చెప్పకుండా దానినో కుట్రగా చిత్రించారని మాజీ రెజ్లర్ యోగేశ్వర్ ఆరోపించారు. ‘రాజకీయాల్లో చేరడం వాళ్లిష్టం. బబితా, నేనూ BJPలో ఉన్నాం. వినేశ్ కాంగ్రెస్‌లో చేరారు. కానీ దేశానికి నిజం తెలియాలి. ఏడాదిగా జరిగిన ఘటనలు, ఒలింపిక్ డిస్‌క్వాలిఫికేషన్, పార్లమెంటు కొత్త భవనం వద్ద ఆందోళనతో భారత ఇమేజ్‌ను చెడుగా చిత్రించారు’ అని విమర్శించారు.

Similar News

News October 9, 2024

BREAKING: నారా లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్

image

AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లిమిటెడ్ కంపెనీ రాబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీని ద్వారా 10వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. దేశంలో వ్యాపారం చేసేందుకు ఏపీని నంబర్-1గా తీర్చిదిద్దడంలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు. కాగా నిన్న బిగ్ <<14307324>>అనౌన్స్‌మెంట్<<>> ఉండబోతున్నట్లు లోకేశ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

News October 9, 2024

రైతుబంధు నిధులు నొక్కేసిన తహశీల్దార్ అరెస్టు

image

TG: అక్రమంగా రైతుబంధు నిధులను పొందిన నల్గొండ జిల్లా అనుముల తహశీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రూ.14.63 లక్షల రైతుబంధు సొమ్మును స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధరణి ఆపరేటర్ జగదీశ్ బంధువుల పేరిట 2019లో జయశ్రీ పాస్ బుక్ జారీ చేశారు. జయశ్రీ, జగదీశ్, పట్టాదారులు రైతుబంధు నిధులను సగం సగం పంచుకున్నారు.

News October 9, 2024

హండ్రెడ్ లీగ్‌కు CSK, KKR సై?

image

ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్‌‌లో ఓ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు సీఎస్కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు చేసేందుకు ఈ రెండు జట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ లంకషైర్‌ అధీనంలో ఉంది. కాగా హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇప్పటివరకు టైటిల్ కొట్టలేదు. రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది.