News April 9, 2024
టెట్పై అభ్యర్థుల అనాసక్తి?

TG: రాష్ట్రంలో టెట్ రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 166475 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నెల 10తో దరఖాస్తుల గడువు ముగియనుంది. దీంతో మొత్తం 2 లక్షల అప్లికేషన్లలోపే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1000కి పెంచడంతో అభ్యర్థులు టెట్ రాసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. మరోవైపు బోధనపై కొంతమందికి ఆసక్తి లేక దరఖాస్తు చేసుకోవడం లేదని తెలుస్తోంది.
Similar News
News October 27, 2025
CSIR-CCMBలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని నవంబర్ 28 వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. వెబ్సైట్: https://www.ccmb.res.in/
News October 27, 2025
కాస్త రిలీఫ్.. తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,140 తగ్గి రూ.1,24,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,050 దిగివచ్చి రూ.1,14,100గా ఉంది. ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ రూ.1,70,000గా ఉంది.
News October 27, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎయిర్టెల్, SBI, HDFC, టెక్ మహీంద్రా, NTPC, ICICI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.


