News April 9, 2024

టెట్‌పై అభ్యర్థుల అనాసక్తి?

image

TG: రాష్ట్రంలో టెట్ రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 166475 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నెల 10తో దరఖాస్తుల గడువు ముగియనుంది. దీంతో మొత్తం 2 లక్షల అప్లికేషన్లలోపే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1000కి పెంచడంతో అభ్యర్థులు టెట్ రాసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. మరోవైపు బోధనపై కొంతమందికి ఆసక్తి లేక దరఖాస్తు చేసుకోవడం లేదని తెలుస్తోంది.

Similar News

News November 13, 2024

నేడు YS జగన్ ప్రెస్ మీట్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ మ.3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన మాట్లాడనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. రూ.2.94లక్షల కోట్ల బడ్జెట్ ప్రజలను నిరాశకు గురిచేసిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము అసెంబ్లీకి హాజరుకాకుండా మీడియా ద్వారా ప్రశ్నిస్తామని జగన్ 3 రోజుల క్రితం ప్రకటించారు.

News November 13, 2024

చలికాలంలో ఇవి తింటున్నారా?

image

చలికాలంలో చాలా మందికి అనారోగ్యం చేస్తుంది. దీనికి కారణం రోగ నిరోధకశక్తి లేకపోవడమే. కానీ కొన్ని పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్, ఫైబర్, ఐరన్ ఉండే బాదం, జీడిపప్పు తింటే శరీరంలోని కండరాలు, నరాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే వాల్ నట్స్, అంజీర్, పిస్తా పప్పు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాన్ వెజ్, డీప్ ఫ్రైలకు దూరంగా ఉండటం బెటర్.

News November 13, 2024

ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్, రామస్వామి

image

డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ సమర్థత శాఖ(Department of Government Efficiency)కి వీరు నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘అధిక నిబంధనల తొలగింపు, వృథా ఖర్చుల తగ్గింపు, ఫెడరల్ సంస్థల పునర్నిర్మాణం వంటి అంశాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తారు. సర్కారు వనరుల్ని వృథా చేస్తున్నవారికి నా నిర్ణయం కచ్చితంగా షాకిస్తుంది’ అని ట్రంప్ తెలిపారు.