News June 11, 2024
గ్రూప్-2,3 పోస్టులు పెంచాలని CM రేవంత్‌కు విజ్ఞప్తి

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలని చొప్పదండి MLA మేడిపల్లి సత్యం CM రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘చాలా కాలం తర్వాత ఆ నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్-1, DSC నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచినట్లే గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. DSC పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలి. గ్రూప్-2 ఎక్సైజ్ SI ఎత్తు 167.6 cms నుంచి 165కు తగ్గించాలి’ అని MLA కోరారు.
Similar News
News March 17, 2025
11 మంది సెలబ్రిటీలపై కేసులు

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.
News March 17, 2025
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా ఇవాళ ఏపీలోని మన్యం జిల్లా వీరఘట్టంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42.6, ప్రకాశం జిల్లా పెద్దారవీడు, నంద్యాల జిల్లా గోనవరంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి, ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, కొమురంభీంలో 41.8, మెదక్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 17, 2025
ఉగాది నుంచి పీ4 విధానం అమలు: సీఎం చంద్రబాబు

AP: ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు అన్నారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తామని తెలిపారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని వివరించారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలు కావాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి APలో 2020 విజన్ వల్ల చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగిందని చెప్పారు.