News October 20, 2024
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
AP: తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల JAC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో దాదాపు 5వేల మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులని పేర్కొంది. ఎన్నికల కోడ్‌తో నిలిచిన క్రమబద్ధీకరణ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని విన్నవించింది. ఎన్నికల ప్రచారంలో తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేసింది.
Similar News
News November 10, 2024
వైట్‌హౌస్‌కు దూరంగా ట్రంప్ కుమార్తె, అల్లుడు!
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక, కుష్నర్ వైట్‌హౌస్‌లో పని చేశారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు అడ్మినిస్ట్రేషన్‌లో పాలుపంచుకునేలా కనిపించడం లేదు. వాళ్లిద్దరూ ట్రంప్ రాజకీయ ప్రచారాల్లోనూ పాల్గొనలేదు.
News November 10, 2024
దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 10, 2024
రాష్ట్రంలో 243 కులాలు: ప్రభుత్వం
TG: రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన నేపథ్యంలో కులాలకు కోడ్‌లను కేటాయించింది. కులం, మతం లేదన్న వారికీ ఓ కోడ్‌ను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా కోడ్‌లతో డేటా సేకరిస్తోంది. భూసమస్యలపైనా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది.