News August 12, 2024
4 సెకన్ల ఆలస్యంతో అప్పీల్.. కాంస్యం కోల్పోయిన అథ్లెట్
ఒలింపిక్స్: జిమ్నాస్టిక్స్‌లో 4 సెకన్లు లేట్‌గా అప్పీల్ చేసినందుకు ఓ అథ్లెట్ కాంస్యం కోల్పోయారు. AUG 5న పోటీలో USకు చెందిన జోర్డాన్ 13.666 స్కోరుతో ఐదోస్థానంలో నిలిచారు. పాయింట్లు తప్పుగా వేశారంటూ ఆమె రివ్యూకు వెళ్లడంతో బ్రాంజ్ దక్కింది. అయితే ఆమె నిర్దేశిత టైం కంటే 4 సెకన్లు ఆలస్యంగా అప్పీల్ చేశారంటూ రొమేనియా బృందం CASను ఆశ్రయించింది. నిజమని తేలడంతో కాంస్యం తిరిగిచ్చేయాలని కోర్టు ఆదేశించింది.
Similar News
News September 18, 2024
పదే పదే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం: కేంద్రమంత్రి
లా కమిషన్ 1999లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘భారత్ వేగంగా అభివృద్ధి కావాలని యువత కోరుకుంటోంది. పదే పదే ఎన్నికలతో ఇందుకు ఆటంకం కలుగుతోంది. 2015లో పార్లమెంట్ కమిటీ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, అనంతరం 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు.
News September 18, 2024
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్
ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు తమ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్‌ను పంజాబ్ కింగ్స్ నియమించింది. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించింది. ‘పంటర్(పాంటింగ్) ఈజ్ పంజాబ్! మా కొత్త హెడ్ కోచ్ పదవిలో పాంటింగ్ జాయిన్ అయ్యారు’ అని పేర్కొంది. గడచిన 7 సీజన్లలో ఆ జట్టు ఆరుగురు కోచ్‌లను మార్చడం గమనార్హం. కాగా పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పనిచేశారు.
News September 18, 2024
ఆరుగురు మారినా ఆ జట్టు రాత మారట్లేదు!
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రదర్శనపరంగా, సిబ్బంది ఎంపిక పరంగా అస్థిరతకు మారుపేరుగా నిలుస్తోంది. వచ్చే సీజన్‌కు రికీ పాంటింగ్‌ను నియమించిన ఆ జట్టు గత 7 సీజన్లలో ఆరుగురు కోచ్‌లను మార్చింది. ఆ టీమ్ ప్రదర్శన చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో కేవలం 2సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. గత పదేళ్లలో అయితే ఒక్కసారీ ప్లేఆఫ్ గడప తొక్కలేదు. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది.