News January 17, 2025

లక్షణాలు లేని హార్ట్ ఎటాక్‌ను గుర్తించిన యాపిల్ వాచ్!

image

ఓ వ్యక్తికి సైలెంట్ హార్ట్ ఎటాక్ రాగా.. దీనిని యాపిల్ గుర్తించిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ‘నా 60 ఏళ్ల స్నేహితుడు వ్యాయామం చేస్తుండగా మొబిట్జ్ టైప్ 2 అట్రియో-వెంట్రిక్యులర్ బ్లాక్ (ఒక రకమైన హార్ట్ బ్లాక్) లక్షణాలు గమనించారు. అతడిలో ఎలాంటి సిమ్‌టమ్స్ కనిపించలేదు. వెంటనే కార్డియాలజిస్ట్ చికిత్స చేయడంతో కోలుకున్నాడు. అతని యాపిల్ వాచ్‌లో హార్ట్ ఎటాక్ అంటూ అలర్ట్ రావడం చూశాం’ అని తెలిపారు.

Similar News

News February 18, 2025

3 నెలలుగా ‘గృహలక్ష్మి’ స్కీమ్ డబ్బుల్లేవ్!

image

కర్ణాటక గ్యారంటీ స్కీములను నిధుల కొరత వేధిస్తోంది. 3 నెలలుగా లబ్ధిదారుల అకౌంట్లలో గృహలక్ష్మి డబ్బులు వేయడం లేదు. అన్నభాగ్య సహా మరికొన్ని స్కీములకూ బదిలీ చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, త్వరలోనే వేస్తామని Dy CM DK శివకుమార్ తెలిపారు. 3 నెలలుగా డబ్బులు వేయడం లేదన్న సంగతి తనకు తెలియదని CM సిద్దరామయ్య అన్నారు. ఏదేమైనా స్కీములను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్.

News February 18, 2025

భారత జట్టుకు స్పెషల్ నంబర్ ‘183’

image

భారత క్రికెట్ జట్టుకు 183 అనే నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో IND తొలి వరల్డ్ కప్ సాధించింది. ఆ ఫైనల్‌లో విండీస్‌పై భారత్ 183 స్కోరుకు ఆలౌటైంది. అలాగే కెప్టెన్లుగా పనిచేసిన గంగూలీ, ధోనీ, కోహ్లీల వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. అయితే ఆ స్కోరు చేసినప్పుడు వారంతా సాధారణ ప్లేయర్లే. గంగూలీ 1999లో, ధోనీ 2005లో శ్రీలంకపై, కోహ్లీ 2012లో పాక్‌పై ఈ స్కోర్లు చేశారు.

News February 18, 2025

BREAKING: టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు డబ్బులు చెల్లించాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

error: Content is protected !!