News July 28, 2024

ఈ వివరాల ఆధారంగానే రైతులకు పథకాల వర్తింపు?

image

TG: రాష్ట్రంలో వ్యవసాయశాఖ పంటల నమోదు కార్యక్రమం చేపట్టింది. అధికారులు ఇప్పటివరకు 24.16లక్షల ఎకరాల వివరాలు నమోదు చేశారు. వ్యవసాయ భూమి వద్దకే వెళ్లి అక్కడి నుంచే సర్వే నంబర్లు, సాగు వివరాలు ఒక ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగానే రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, రుణమాఫీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ సర్వే చేపట్టింది.

Similar News

News February 12, 2025

అధికారులు ప్రతినెలా 3-4 జిల్లాల్లో తిరగాలి: సీఎం

image

AP: గ్రూప్-1 అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 3-4 జిల్లాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ఒక్కొక్క ఉన్నతాధికారి ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు.

News February 12, 2025

మంచి మాట – పద్యబాట

image

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

భావం: శారీరకంగా బలంగా ఉన్నవాడికంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా మచ్చిక చేసుకుని దానిమీదకు ఎక్కగలడు.

News February 12, 2025

నన్ను రాజకీయాల్లోకి లాగకండి: విశ్వక్

image

తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్‌సేన్ నెటిజన్లను కోరారు. తాను మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పోస్టర్‌ నెల రోజుల క్రితం విడుదలైందని, రెడ్ సూట్ ఫొటో కూడా ఇప్పటిది కాదని చెప్పారు. ‘ప్రతీసారి తగ్గను. కానీ నిన్న మనస్ఫూర్తిగా <<15423495>>సారీ<<>> చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. శాంతంగా ఉండండి. అసభ్య పదజాలం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైలాను బాయ్‌కాట్ చేయాలన్న ఆలోచనను బాయ్‌కాట్ చేయండి’ అని X పోస్ట్ పెట్టారు.

error: Content is protected !!