News July 22, 2024

రైతు బీమాకు దరఖాస్తులు.. ఆగస్టు 5 వరకు గడువు

image

TG: రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-59 ఏళ్ల వయసు ఉన్న వారు ఏఈవోలకు అప్లికేషన్లు ఇవ్వాలి. రైతులు పట్టాదార్ పాస్‌బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్, నామినీ ఆధార్‌కార్డు జత చేయాలి. జూన్ 28 వరకు పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారూ అర్హులేనని వ్యవసాయ శాఖ పేర్కొంది.

Similar News

News December 4, 2025

మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్‌ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.