News July 22, 2024

రైతు బీమాకు దరఖాస్తులు.. ఆగస్టు 5 వరకు గడువు

image

TG: రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-59 ఏళ్ల వయసు ఉన్న వారు ఏఈవోలకు అప్లికేషన్లు ఇవ్వాలి. రైతులు పట్టాదార్ పాస్‌బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్, నామినీ ఆధార్‌కార్డు జత చేయాలి. జూన్ 28 వరకు పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారూ అర్హులేనని వ్యవసాయ శాఖ పేర్కొంది.

Similar News

News October 8, 2024

ఈరోజు దుర్గమ్మను దర్శిస్తే ఐశ్వర్యమే!

image

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు విజయవాడ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. మంగళప్రదమైన దుర్గమ్మను దర్శించుకున్న వారికి ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని ప్రతీతి. మూడు శక్తుల్లో ఒకరైన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిన విషయం తెలిసిందే.

News October 8, 2024

నేడు అమిత్‌షా, నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న PM మోదీతో సమావేశమైన CM చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వరద నష్టం, నిధుల విడుదలపై హోంమంత్రి అమిత్‌షాతో, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీన ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నితిన్ గడ్కరీతో సమాలోచనలు చేస్తారు. పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్‌తో ఆయన భేటీ కానున్నారు.

News October 8, 2024

భారత క్రికెటర్‌కు మ్యాచ్ ఫీజులో 50శాతం కోత

image

భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డిని ఐసీసీ మందలించింది. పాకిస్థాన్‌తో మ్యాచులో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఒక డీమెరిట్ పాయింట్ పెనాల్టీని విధించింది. పాక్ ప్లేయర్ నిదా దార్‌ని ఔట్ చేసిన క్రమంలో అరుంధతి పెవిలియన్ వైపు చూపిస్తూ సైగ చేసింది. దీంతో ఐసీసీ పెనాల్టీతో పాటు భారత క్రికెటర్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.