News May 3, 2024

APPLY: రైల్వేలో 4,660 ఉద్యోగాలు

image

RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208)కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు. SI అభ్యర్థులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. SIలకు ₹35,400, కానిస్టేబుళ్లకు ₹21,700 ప్రారంభ వేతనం ఉంటుంది. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

Similar News

News March 6, 2026

చీకటిని చీల్చుతూ ఉదయించిన ‘రవి’కిరణుడు❤️

image

ఇవాళ రిలీజైన UPSC ఫలితాల్లో రాణించిన బిహార్‌‌కు చెందిన రవి రాజ్ స్పెషల్. తన చిన్నతనంలోనే చూపు కోల్పోయినా పట్టుదలతో చదివి 20వ ర్యాంకు సాధించి IAS అధికారి కాబోతున్నారు. ఈ ప్రయాణంలో తల్లి విభ ఆయనకు దిక్సూచిగా మారారు. ఆమె పుస్తకాలు చదివి వినిపిస్తూ, నోట్స్ రాస్తూ కుమారుడిని ప్రోత్సహించారు. ఇప్పటికే BPSC సాధించి.. పట్టుదలకు అమ్మ ప్రేమ తోడైతే గెలుపు సాధ్యమేనని రవి ప్రపంచానికి చాటిచెప్పారు.

News March 6, 2026

నా కథను రేప్ చేశారు.. రచయిత షాకింగ్ కామెంట్స్

image

సినీ రచయిత సాయిమాధవ్ బుర్రా FBలో షాకింగ్ పోస్టు చేశారు. ఓ మూవీలో తన కథను రేప్ చేశారని ఆరోపించారు. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని మానభంగం చేశారు. నాది రివేంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’ అని రాసుకొచ్చారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి, ఇవాళ రిలీజైన ‘సరస్వతి’ గురించే ఆయన మాట్లాడినట్లు సమాచారం.

News March 6, 2026

మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం: CM

image

TG: మూసీ నదిలో చెత్త, మురికి పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరని CM రేవంత్ చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వ్యాపారాలను విస్తరిస్తామని తెలిపారు. రంగారెడ్డి(D) కొత్వాల్‌గూడలో ఎకో పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి జరగాలంటే కొందరు భూమి కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ అన్యాయం చేయం. అందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.