News October 15, 2024

APPLY: కేజీబీవీల్లో 729 పోస్టులు.. ఇవాళ్టితో లాస్ట్

image

AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. కుక్, వాచ్‌మెన్, స్వీపర్, చౌకీదార్ వంటి పోస్టులున్నాయి. 01-7-2024 నాటికి 42 ఏళ్లు మించని మహిళా అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు MEO ఆఫీసులో దరఖాస్తులు అందజేయాలని అధికారులు తెలిపారు. వీటిని ఔట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేయనున్నారు. ఈ నెల 22న తుది జాబితాను ప్రకటిస్తారు.

Similar News

News November 10, 2024

BREAKING: నటుడు ఢిల్లీ గణేశ్ మృతి

image

ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన తన ఇంట్లోనే అర్ధరాత్రి మృతి చెందారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా గణేశ్ 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్2, కాంచన3, అభిమన్యుడు వంటి అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనూ అలరించారు.

News November 10, 2024

సాల్ట్ సెంచరీ.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ గెలుపు

image

5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20ఓవర్లలో 182/9 స్కోర్ చేసింది. చేధనకు దిగిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 54 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 రన్స్‌తో మెరుపు శతకం బాదారు. జాకబ్ బెథెల్(58)రాణించారు.

News November 10, 2024

వైట్‌హౌస్‌కు దూరంగా ట్రంప్ కుమార్తె, అల్లుడు!

image

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక, కుష్నర్ వైట్‌హౌస్‌లో పని చేశారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు అడ్మినిస్ట్రేషన్‌లో పాలుపంచుకునేలా కనిపించడం లేదు. వాళ్లిద్దరూ ట్రంప్ రాజకీయ ప్రచారాల్లోనూ పాల్గొనలేదు.