News March 18, 2024
హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోండి: EC
రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. 85ఏళ్లు నిండిన వారు హోమ్ ఓటింగ్ కోసం ఏప్రిల్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరో మూడు రోజుల్లో హోమ్ ఓటింగ్ దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 90వేల పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు.
Similar News
News September 21, 2024
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
AP: ఎంఎన్‌సీ కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది. మెక్‌డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం నిన్న రాష్ట్రానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే వస్తాయన్నారు.
News September 21, 2024
కొత్తదారులు వెతకడమే ‘బైడెన్, మోదీ మీటింగ్’ ఎజెండా
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఏర్పడిన కీలక దేశాల కూటమే క్వాడ్ అని PM మోదీ అన్నారు. అమెరికాకు బయల్దేరే ముందు ఆయన మాట్లాడారు. ‘క్వాడ్ సమ్మిట్లో ప్రెసిడెంట్ బైడెన్, PM అల్బనీస్, PM కిషిదాను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచం మేలు, మన ప్రజల ప్రయోజనం కోసం IND-US అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలోపేతానికి కొత్త మార్గాలను బైడెన్‌తో సమావేశంలో అన్వేషిస్తాం’ అని అన్నారు.
News September 21, 2024
తిన్న వెంటనే మళ్లీ ఆకలి అవుతోందా?
తిన్న వెంటనే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందంటే దాని వెనుక నిర్దిష్ట కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొన్ని వ్యాధుల వల్ల ఇలా అనిపిస్తుందని చెబుతున్నారు. యాంటీ సైకోటిక్ మందులు, స్టెరాయిడ్లు వాడినా, రాత్రి పూట నిద్రలేకపోయినా, ఒత్తిడికి గురైనా, మధుమేహం ఉన్నా శరీరం ఎక్కువ ఆహారం కోరుకుంటుంది. అలాగే సెక్స్ హార్మోన్లలో మార్పులు, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినా, కార్టిసాల్ పెరిగినా ఆహార కోరికలు పెరుగుతాయి.