News October 15, 2024
APPLY: నెలకు రూ.20,000తో ఇంటర్న్‌షిప్
సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఇండియా అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఏటా 125 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. వేసవికాలంలో నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌లో మూడు నెలల పాటు రూ.20వేల చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. పీజీ, మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్నవారు లేదా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Similar News
News November 13, 2024
RGVకి నోటీసులు ఇచ్చిన పోలీసులు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీమ్ ఇవాళ HYDలోని ఆర్జీవీ ఇంటికి చేరుకుని నోటీసులు అందించారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది.
News November 13, 2024
ప్రభాస్ ‘స్పిరిట్’లోకి పూరీ జగన్నాథ్?
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ గురించి టాలీవుడ్‌లో ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాకు డైలాగ్స్ రాయాలంటూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సందీప్ అడిగారని సమాచారం. అందుకు పూరీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రభాస్‌తో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల్లో డైలాగ్స్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
News November 13, 2024
తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి ధర రూ.440 తగ్గి రూ.76,850కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.70,450 పలుకుతోంది. అటు వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.