News September 18, 2024
APPLY NOW: 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలు

CISFలో 1,130 కానిస్టేబుల్(పురుషులు) ఉద్యోగాలకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తిచేసి, 18-23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫీజు రూ.100. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
వెబ్సైట్: https://cisfrectt.cisf.gov.in/
Similar News
News February 4, 2026
CUET UG.. మరికొన్ని గంటలే ఛాన్స్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG-2026) రిజిస్ట్రేషన్ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. రా.11.50 వరకు <
News February 4, 2026
ఎంత సంపద ఉన్నా.. ఆనందం లేదా?

సంపద ఎంతున్నా దాన్ని అనుభవించలేకపోతే అందుకు పండితులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. శనివారం శెనగలు పంచడం, శివలింగానికి బిల్వార్చన చేయడం మంచిదంటున్నారు. నిత్యం ధ్యానం చేయాలంటున్నారు. ‘అమ్మవారికి పసుపు చీర సమర్పించాలి. శుక్రవారం ధ్వజస్తంభం వద్ద మినప్పండి దీపం వెలిగించాలి. ఇంటికి వేపాకుల దండ కట్టడం వల్ల దిష్టి తొలగి ఆస్తులు అనుభవించే యోగం కలుగుతుంది. దానాలు శీఘ్ర ఫలితాలు ఇస్తాయి’ అంటున్నారు.
News February 4, 2026
గుడ్ న్యూస్: గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

TG: రాష్ట్రంలోని గృహాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్లను ఉచితంగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చేసిన సిఫార్సును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇళ్లకు కనెక్షన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు అయ్యే ఖర్చును వినియోగదారుడి నుంచి వసూలు చేసేవారు. ఇప్పుడిది ఉచితంగా అందుతుంది. ఈ సౌకర్యం పారిశ్రామిక రంగానికి వర్తించదు.


