News September 18, 2024

APPLY NOW: 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలు

image

CISFలో 1,130 కానిస్టేబుల్(పురుషులు) ఉద్యోగాలకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తిచేసి, 18-23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫీజు రూ.100. పే స్కేల్ రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in/

Similar News

News October 5, 2024

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందంటే?

image

TG: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనుంది. రేషన్ షాప్‌కు వెళ్లి ఈ కార్డులోని QR కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ స్కీములు, RTC బస్సుల్లో పదే పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చు.

News October 5, 2024

బొగ్గు కన్నా LNGతోనే ఎక్కువ నష్టం

image

పర్యావరణ అనుకూల ఇంధనంగా భావించే LNG(లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) గురించి ఓ షాకింగ్ రిపోర్టును కార్నెల్ వర్సిటీ(US) శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వంట, విద్యుత్ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా వినియోగించే దీనివల్ల 20 ఏళ్లలో బొగ్గు కన్నా 33% ఎక్కువగా గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలైనట్లు తెలిపారు. కాగా మీథేన్‌తో తయారయ్యే సహజ వాయువులను LNGగా మార్చడానికి మైనస్ 105 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబర్చాల్సి ఉంటుంది.

News October 5, 2024

ఈసారి చలి తీవ్రత అధికం: IMD

image

దేశవ్యాప్తంగా ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని IMD వెల్లడించింది. తిరోగమనంలో నైరుతి రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉందని, దీనివల్ల ఈ నెలలో ‘లా నినా’ ఏర్పడే పరిస్థితులున్నాయని తెలిపింది. వాయవ్య, మధ్య భారతదేశంలో విపరీతమైన చలిగాలులు వీస్తాయంది. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయినప్పుడు లా నినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3-5 డిగ్రీలు ఉండొచ్చు.