News May 26, 2024
APPLY NOW: 312 ప్రభుత్వ ఉద్యోగాలు

పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 312 ఉద్యోగాల భర్తీకి UPSC దరఖాస్తులు స్వీకరిస్తోంది. స్పెషలిస్ట్ గ్రేడ్-3, అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రైనింగ్ ఆఫీసర్ తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, MBBS అర్హత ఉండాలి. <
Similar News
News February 16, 2025
‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి ఎప్పుడంటే?

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ Xలో వెల్లడించింది. ‘అనగనగా ఒక రాజు.. చెడ్డవాళ్లు అందరూ డాకు అనేవాళ్లు.. కానీ మాకు మాత్రం మహారాజు’ అని రాసుకొచ్చింది. గత నెల 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
News February 16, 2025
తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ప్రత్యేక అధ్యాయం: CM

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి <<15477241>>మరణం<<>> బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. నందమూరి తారక రామారావు నట జీవితానికి తొలుత అవకాశం ఇచ్చింది కృష్ణవేణే అని గుర్తు చేసుకున్నారు. ఇటీవల NTR సెంటినరీ, వజ్రోత్సవ వేడుకల్లో ఆమెను సత్కరించానని తెలిపారు.
News February 16, 2025
హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా?

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. HYD నుంచి విజయవాడ వెళ్లేవారు నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.