News January 29, 2025

APPLY NOW.. 32,438 ఉద్యోగాలు

image

రైల్వేలో 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి <<15227255>>దరఖాస్తుల <<>>స్వీకరణ కొనసాగుతోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. వయసు 18-36 ఏళ్లలోపు ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. ప్రిలిమ్స్‌కు హాజరైతే రూ.400 వెనక్కి వస్తుంది. CBT, PET, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News February 13, 2025

93 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్: మంత్రి

image

TG: టీ ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే మూడేళ్లలో 93 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ అందిస్తామన్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశంలో ఆయన దీని గురించి వివరించారు. ఇప్పటికే రంగారెడ్డి(D) హాజిపల్లి, నారాయణపేట-మద్దూరు, సంగారెడ్డి-సంగుపేట, పెద్దపల్లి(D) అడవి శ్రీరాంపూర్‌లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా దీనిని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

News February 13, 2025

PMAY ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

image

AP: PMAY 1.0ను కేంద్రం 2027 వరకు పొడిగించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. PMAY 2.0 సర్వే కొనసాగుతోందని, ఇప్పటివరకు 11,600 మంది లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. గతంలో TDP హయాంలో 3.18L మందిని ఎంపిక చేయగా, YCP ఆ జాబితాను మార్చేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందన్నారు. అప్పుడు మిగిలిపోయిన వారికి 2024 ఏప్రిల్ తర్వాత ఇళ్లు మంజూరయ్యాయని, మరో 4.5L ఇళ్లను కేటాయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

News February 13, 2025

RCB కెప్టెన్‌గా రజత్ పాటిదార్?

image

IPL-2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ తమ కెప్టెన్‌ను ప్రకటించనుంది. రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాటిదార్ కెప్టెన్‌గా మెప్పించారు. మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్‌కు చేర్చారు. 2021 నుంచి RCBకి ఆడుతున్నారు. కాగా కోహ్లీ తిరిగి RCB కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!