News January 26, 2025

APPLY NOW.. 4,597 ఉద్యోగాలు

image

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో 4,597 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 66 విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ఫార్మసిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. దరఖాస్తుకు ఈ నెల 31 చివరి తేదీ.

Similar News

News February 13, 2025

రజినీకాంత్‌పై RGV కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

image

రజినీకాంత్‌పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ‘క్యారెక్టర్‌ను బట్టి నటన ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్లవుతారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రజినీ గొప్ప నటుడా? నాకు తెలిసి భిఖు మాత్రే పాత్రను(సత్యలో మనోజ్ బాజ్‌పేయి) ఆయన చేయలేడు. ఆయన ఏం చేయకపోయినా స్లో మోషన్‌లో నడిచొస్తే చాలు ప్రేక్షకులు చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో RGV అన్నారు. దీంతో ఆయనపై రజినీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

News February 13, 2025

మంచి మాట – పద్యబాట

image

కానివాని తోడ గలసి మెలగుచున్న
గానివాని వలెనె కాంతు రతని
తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ

భావం: దుష్టులతో కలిసి తిరిగితే మంచివాడిని కూడా ఈ లోకం చెడ్డవాడిగానే పరిగణిస్తుంది. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా తాటికల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా.

News February 13, 2025

కేఎల్ రాహులే మాకు ప్రాధాన్యం: గంభీర్

image

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ కోచ్ గంభీర్ ఆయనకు అండగా నిలిచారు. ‘టీమ్ ఇండియాకు ప్రస్తుతం రాహులే నంబర్ వన్ వికెట్ కీపర్. అతడే మా ప్రాధాన్యం. పంత్‌కు తన అవకాశాలు తనకొస్తాయి. ఇప్పటికైతే ఇద్దరు కీపర్లను ఆడించే పరిస్థితి లేదు’ అని తేల్చిచెప్పారు. పంత్‌తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ రికార్డులు మెరుగ్గా ఉండటంతో అతడివైపే జట్టు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.

error: Content is protected !!