News September 28, 2024
APPLY NOW.. 8,113 ఉద్యోగాలు
రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు OCT 13 వరకు అప్లై చేయవచ్చు. OCT 16-25 మధ్య దరఖాస్తుల సవరణకు ఛాన్సుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). వివరాలకు ఇక్కడ <
Similar News
News October 7, 2024
ఈ ఏడాది SBIలో 10,000 ఉద్యోగాలు
ప్రభుత్వరంగ బ్యాకింగ్ దిగ్గజం SBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎంట్రీ లెవెల్ నుంచి హైలెవెల్ వరకు దాదాపు 1,500 మంది టెక్నికల్ సిబ్బంది నియామకానికి ఇటీవల ఉద్యోగ ప్రకటన చేశామన్నారు. కొత్త ఉద్యోగాల్లో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్ట్స్, నెట్వర్క్ ఆపరేటర్స్ వంటివి ఉన్నట్లు తెలిపారు.
News October 7, 2024
యుద్ధాల్లేని భూగోళం కోసం ఏం చేయాలి!
‘విద్వేషం పాలించే దేశం ఉంటుందా, విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా, ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా, అడిగావా భూగోళమా, నువ్ చూశావా ఓ కాలమా’ అన్న సిరివెన్నెల లిరిక్స్ అక్షర సత్యాలు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఏడాది. రష్యా-ఉక్రెయిన్ వార్ రెండేళ్లు దాటేసింది. ఏవీ ఇప్పట్లో ముగిసేలా లేవు. తప్పెవరిదన్నది పక్కన పెడితే ప్రజలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. యుద్ధాల్లేని భూగోళం కోసం ఏం చేయాలి? మీ కామెంట్.
News October 7, 2024
సలార్-2 నుంచి క్రేజీ లీక్స్.. PHOTOS వైరల్
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన సలార్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ శౌర్యాంగపర్వంపై అంచనాలు పెరిగాయి. గతంలోనే ఈ చిత్ర షూటింగ్ కొంత పూర్తవగా, దీనికి సంబంధించి టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్ వైరలవుతున్నాయి. కాటేరమ్మ ఫైట్ కంటే క్రేజీగా ఉంటుందని టాక్. ఈ లీక్స్‌పై మేకర్స్ స్పందించలేదు. ప్రస్తుతం డైరెక్టర్, హీరో బిజీగా ఉండటంతో రెండో భాగం షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.