News August 3, 2024

APPLY NOW: ITBPలో కానిస్టేబుల్ పోస్టులు

image

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP)లో 143 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బార్బర్/సఫాయి కర్మచారి, గార్డ్‌నర్ ఉద్యోగాలకు ఈనెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI పాసై, నిబంధనల మేరకు శారీరక కొలతలు ఉండాలి. PET/PST, రాత పరీక్ష, స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. కాగా ITBPలోనే 112 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎల్లుండితో గడువు ముగియనుంది.
వెబ్‌సైట్: <>itbpolice.nic.in/<<>>

Similar News

News October 8, 2024

నాగార్జున పిటిషన్ నిలబడదనుకుంటున్నాం: సురేఖ తరఫు లాయర్

image

మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో నిలబడేలా లేదని ఆమె తరఫు న్యాయవాది తిరుపతి వర్మ అన్నారు. ‘ఈ కేసు విచారణలో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాల్లో తేడాలు ఉన్నాయి. నాగార్జున పిటిషన్‌లో ఒకటి, వాంగ్మూలంలో మరొకటి చెప్పారు. ఆయన కోడలు సుప్రియ ఇంకొకటి చెబుతున్నారు. మరో సాక్షి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేస్తుంది. ఒకవేళ నోటీసులు వస్తే చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని ఆయన చెప్పారు.

News October 8, 2024

జమ్మూకశ్మీర్‌లో ఈ ఎన్నికలు ప్రత్యేకం: మోదీ

image

JKలో ఆర్టిక‌ల్ 370, 35(A) ర‌ద్దు త‌రువాత మొద‌టిసారిగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు ఎంతో ప్ర‌త్యేకం అని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. భారీగా న‌మోదైన ఓటింగ్‌ ప్ర‌జాస్వామ్యంపై ప్ర‌జ‌ల విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించింద‌న్నారు. పార్టీ ప‌నితీరుపై హ‌ర్షం వ్య‌క్తం చేసిన మోదీ ఓటువేసిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. JK ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిరంత‌రం ప‌ని చేస్తామ‌న్నారు. మెరుగైన ఫ‌లితాలు సాధించిన NCని అభినందించారు.

News October 8, 2024

BIG BREAKING: బీజేపీ సంచలన విజయం

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లినా క్రమంగా కమలం రేసులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి వరుసగా సీట్లు గెలుస్తూ మ్యాజిక్ ఫిగర్ (46) దాటింది. EC లెక్కల ప్రకారం 90 సీట్లకు గాను BJP 46, కాంగ్రెస్ 35 చోట్ల గెలిచాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.