News April 11, 2024
APPLY NOW.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్/ సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. జూన్ 4వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. వేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: https://ssc.gov.in
Similar News
News April 13, 2026
ఆశా భోస్లే ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

<<19630743>>ఆశా భోస్లే<<>> నికర ఆస్తుల విలువ ₹200-250 కోట్లని అంచనా. సింగింగ్, పాడిన పాటలపై వచ్చే రాయల్టీలతో పాటు గ్లోబల్ కాన్సర్ట్‌లు, స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఆమెకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టాయి. ‘Asha’s’ పేరుతో ఆమెకు రెస్టారెంట్ బిజినెస్ కూడా ఉంది. ఇది దుబాయ్, UKలో రుచికరమైన భారతీయ వంటకాలను అందిస్తోంది. అలాగే ముంబయిలో లగ్జరీ ఫ్లాట్‌తో పాటు ఆమెకు దాదాపు ₹80-100 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు ఉన్నట్లు సమాచారం.
News April 13, 2026
టమాటాలో బొడ్డు కుళ్లు/ పూత వైపు కుళ్లు నివారణకు సూచనలు

టమాటా అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడి, మొక్కల్లో కాల్షియం లోపం వల్ల బొడ్డు కుళ్లు కనిపిస్తుంది. నత్రజని, నేలలో కరిగే పోటాషియం, మెగ్నిషియం ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు నేలలో తేమ హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. భూమిలో తగినంత కాల్షియం ఉండేట్లు చూసుకోవాలి. పైరు కోత దశలో కాల్షియం నైట్రేట్ 7.5-10 గ్రాములు లేదా కాల్షియం క్లోరైడ్ 4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News April 13, 2026
APPLY NOW: NICలో 153 ఉద్యోగాలు

153 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూఢిల్లీ దరఖాస్తులను కోరుతోంది. వీటిలో సైంటిఫిక్-C-12, సైంటిస్ట్-D-141 పోస్టులున్నాయి. B.E/B.Tech/M.Sc/ME /M.Tech/M.Philతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సైంటిస్ట్-Cకు 35, సైంటిస్ట్-Dకు 40 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30.4.26. మరిన్ని వివరాలకు recruitment.nic.in చూడండి.


