News August 4, 2024

APPLY NOW.. నెలకు రూ.1.42 లక్షల జీతంతో ఉద్యోగాలు

image

312 హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేట్ , ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) <>నోటిఫికేషన్<<>> రిలీజ్ చేసింది. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టు చదివిన వారు అర్హులు. పోస్టును బట్టి నెలకు రూ.35,400 నుంచి రూ.1,42,000 జీతం చెల్లిస్తారు. ఆగస్టు 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చు. 26వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అక్టోబర్/నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

Similar News

News September 17, 2024

మహేశ్-రాజమౌళి మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి SSMB29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన పోస్ట్ వైరలవుతోంది. ఇందులో స్టోరీ-విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ-P.S. వినోద్ అని రాసి ఉంది. కాగా దసరాకు షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News September 17, 2024

‘మ్యాడ్’ సీక్వెల్‌పై రేపే అప్డేట్

image

నార్నె నితిన్ హీరోగా సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌, ఫస్ట్ సింగిల్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ‘మ్యాడ్ మ్యాక్స్‌తో బాయ్స్ మళ్లీ రాబోతున్నారు’ అని పోస్టర్‌ రిలీజ్ చేశారు. కాగా ‘మ్యాడ్’ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

News September 17, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.