News January 25, 2025
APPLY NOW: భారీ జీతంతో ఉద్యోగాలు

ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసి, యూపీఎస్సీ నిర్వహించిన CMSE-2022&2023 ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
Similar News
News November 5, 2025
‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్ల దోపిడీ.. చివరికి..

థ్రిల్లర్ సిరీస్ ‘Money Heist’ ప్రేరణతో ₹150 కోట్లు దోచుకుంది ఢిల్లీకి చెందిన గ్యాంగ్. నిందితులు అర్పిత్(ప్రొఫెసర్), ప్రభాత్(అమాండా), అబ్బాస్(ఫ్రెడ్డీ) తమ పేర్లను సిరీస్‌లో మాదిరి మార్చుకున్నారు. SMలో పలు గ్రూపులు ఏర్పాటు చేసి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చారు. తర్వాత హై రిటర్న్స్ ఇస్తామని నమ్మించి ₹కోట్లు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 2 రాష్ట్రాల్లో దాడులు చేసి వారిని పట్టుకున్నారు.
News November 5, 2025
ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల లోపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, MBNR, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?
News November 5, 2025
రేవంత్, కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్

TG: ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ ఏ ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ప్రచారం సందర్భంగా రేవంత్, KCRపై ఆయన ఫైర్ అయ్యారు. ‘తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు అడిగితే రేవంత్ ఫ్రీ బస్సు అంటున్నారు. అటు కేసీఆర్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు కానీ ఆయన కుటుంబీకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు’ అని మండిపడ్డారు.


