News January 25, 2025
APPLY NOW: భారీ జీతంతో ఉద్యోగాలు

ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసి, యూపీఎస్సీ నిర్వహించిన CMSE-2022&2023 ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
Similar News
News February 16, 2025
రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల(మ) పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని స్కూళ్లకు విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు, నల్గొండ జిల్లాలో స్కూళ్లకు సెలవు ఇస్తూ ఆయా కలెక్టర్లు ప్రకటన చేశారు. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా పేరు గాంచిన పెద్దగట్టు జాతరకు 25 లక్షల మందికి పైగా భక్తులు పలు రాష్ట్రాల నుంచి తరలివస్తారు.
News February 16, 2025
మళ్లీ వస్తున్నాం: తెలుగులో Delhi Capitals ట్వీట్

IPL-2025లో Delhi Capitals 2 మ్యాచ్‌లు విశాఖపట్నంలో ఆడనుంది. ఈ నేపథ్యంలో ‘మళ్లీ వస్తున్నాం. వైజాగ్‌కు మాకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అని తెలుగులో ట్వీట్ చేసింది. APలోని రాజాంకు చెందిన GMR గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు కుమారుడే ఢిల్లీ జట్టు కోఓనర్ కిరణ్ కుమార్. ఆయన ప్రస్తుతం GMR ఎయిర్‌పోర్ట్స్‌కు కార్పొరేట్ ఛైర్మన్‌గా ఉన్నారు. సొంత రాష్ట్రంపై అభిమానంతో 2వ హోం వెన్యూగా వైజాగ్‌ను ఎంచుకున్నారు.
News February 16, 2025
రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు

AP: తిరుపతిలో రేపు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు టెంపుల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.