News February 17, 2025

APPLY NOW.. నెలకు రూ.5000

image

నిరుద్యోగ యువతకు శుభవార్త. పీఎం ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా టాప్-500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద రూ.6000 ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News April 17, 2026

అహాన్, అనీత్.. మరో సినిమాకు ‘సై’యారా

image

బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై <<17590211>>బాక్సాఫీస్‌ను<<>> షేక్ చేసిన సినిమా ‘సైయారా’. ఇందులో అహాన్ పాండే, అనీత్ పడ్డా నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ జంట మరో రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు సిద్ధమైంది. సైయారా తెరకెక్కించిన డైరెక్టర్ మోహిత్ సూరి, ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించి, 2027లో మూవీని విడుదల చేసే అవకాశం ఉంది.

News April 17, 2026

డీలిమిటేషన్.. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఇలా..

image

డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని మోదీని నిన్న లోక్‌సభలో పునరుద్ఘాటించారు. కేంద్రం లెక్కల ప్రకారం సౌత్ స్టేట్స్‌లో సీట్ల పెంపు ఇలా ఉంటుంది.
☞ ఏపీ 25 నుంచి 38కి, ☞ తెలంగాణ 17 నుంచి 26కు, ☞ తమిళనాడు 39 నుంచి 59కి, ☞ కర్ణాటక 28 నుంచి 42కు, ☞ కేరళం 20 నుంచి 30కి పెరగనున్నాయి. మొత్తంగా 5 దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న 129 ఎంపీ సీట్లు 195కి చేరతాయి.

News April 17, 2026

4 కులాల్లోనే 40శాతం మంది పేదలు!

image

TGలో కులాల మధ్య అసమానతల తీవ్రతను సీపెక్ సర్వే బహిర్గతం చేసింది. రూ.లక్షలోపు వార్షికాదాయం కలిగిన 1.10కోట్ల మంది నిరుపేదల్లో 40% మంది మాదిగ, లంబాడా, ముదిరాజ్, యాదవులేనని పేర్కొంది. విద్యాపరంగానూ అసమానతలు ఉన్నాయంది. కొన్ని కులాల్లో ఉన్నత విద్యావంతులు 35.37% ఉండగా మరికొన్ని కులాల్లో ఇది 5% లోపేనని తెలిపింది. మాదిగ, STల్లోనే అత్యధిక బాలకార్మికులు ఉన్నారని, వడ్డెరలో 55% మంది దినసరి కూలీలని చెప్పింది.