News March 12, 2025
APPLY: అకౌంట్లలోకి రూ.6,000

రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను ప్రధాని మోదీ FEB 24న విడుదల చేశారు.
వెబ్‌సైట్: <
Similar News
News March 12, 2025
తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఎంగా పనిచేశారు: CBN

AP: TDPతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని అసెంబ్లీలో CM CBN అన్నారు. ‘ఎన్టీఆర్ మహిళలకు తొలిసారిగా ఆస్తి హక్కు కల్పించారు. కానీ తల్లి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో CMగా(జగన్‌ను ఉద్దేశించి) ఉన్నారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకెళ్లారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే వాటా ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకుంటోంది’ అని తెలిపారు.
News March 12, 2025
హలాల్ మటన్ తినాలని హిందూ గ్రంథాల్లో రాయలేదు: మహా మంత్రి

హిందువులకు హలాల్ మటన్‌కు ప్రత్యామ్నాయంగా మల్హర్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుందని మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణె అన్నారు. ఇస్లామిక్ పద్ధతైన హలాల్‌కు హిందూ మతంతో సంబంధం లేదని, దాని గురించి ఎక్కడా రాయలేదని స్పష్టం చేశారు. ‘హైందవాన్ని ఆచరించేవారు ఒక్కటై హిందూ సమాజం హక్కుల కోసం ప్రత్యామ్నాయ మటన్ తీసుకొస్తున్నారు. తింటే హలాల్ తినాలని లేదంటే మానేయాలని ఇన్నాళ్లూ ఒత్తిడి చేశారు. ఝట్కాకే నా మద్దతు’ అని అన్నారు.
News March 12, 2025
ఆరోజునే భూమి మీదకు సునీతా విలియమ్స్!

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు చేరుకోనున్నారు. స్పేస్‌ఎక్స్ సంస్థ పంపనున్న వ్యోమనౌకలో వీరు తిరిగి భూమి మీదకు చేరుకోనున్నారు. ఈరోజు క్రూ-10ను ప్రయోగించనుండగా, అది ఈనెల 16న ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురానుంది. సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.