News September 7, 2024

మైనర్లకు పాన్ కార్డు అప్లై చేస్తున్నారా?

image

పిల్ల‌ల పేరిట పాన్ కార్డుకు అప్లై చేసేవారు ఫాం 49Aని వినియోగించాలి. దీనిపై తల్లిదండ్రుల సంతకం తప్పనిసరి. అలాగే పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఫొటో సహా ఇతర పత్రాలు అవసరం. మైన‌ర్ల‌కు జారీ చేసే పాన్‌కార్డులో వారి ఫొటో, సంత‌కం ఉండ‌దు. వాళ్లు మేజ‌ర్లు(18 ఏళ్లు) అయ్యేంత వ‌ర‌కు మాత్ర‌మే ఈ కార్డు చెల్లుతుంది. తిరిగి స‌వ‌ర‌ణ‌లకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డు నంబ‌ర్ అలాగే కొన‌సాగుతుంది.

Similar News

News October 5, 2024

గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు BJP MP నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు. ‘ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది. వారు బీజేపీకి ఓటేసి తమ దీవెనల్ని అందిస్తారని నమ్మకంతో ఉన్నాం. నయబ్ సింగ్ మళ్లీ CM అవుతారు’ అని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో 90 స్థానాలకు ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది.

News October 5, 2024

నేనిప్పుడు గాంధేయవాదిని: ఉగ్రవాది యాసిన్ మాలిక్

image

తాను 1994 నుంచే హింసను వదిలేశానని, ఇప్పుడు గాంధేయవాదినని ఉగ్రవాది, వేర్పాటువాది యాసిన్ మాలిక్ చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) ట్రిబ్యునల్‌కు తెలిపారు. శాంతియుత విధానాల్లోనే స్వతంత్ర, ఐక్య కశ్మీర్‌ను సాధించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మాలిక్ ప్రస్తుతం తిహార్‌ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 1990లో భారత వాయుసేనకు చెందిన నలుగురు అధికారుల హత్యలో మాలిక్ ప్రధాన నిందితుడు.

News October 5, 2024

అత్యంత అరుదైన ఖగోళ దృశ్యం.. మళ్లీ 80వేల ఏళ్ల తర్వాతే!

image

మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సుచిన్‌షాన్-అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. 2023లో సూర్యుడికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు దీన్ని తొలిసారి గుర్తించామని పేర్కొంది. ఈ నెల 9-10 తేదీల మధ్య స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ఈ తోకచుక్క భూమి సమీపానికి మళ్లీ వచ్చేది మరో 80వేల సంవత్సరాల తర్వాతే!