News August 31, 2024
TG, ఏపీకి ఏఐసీసీ కార్యదర్శుల నియామకం
దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏఐసీసీ కార్యదర్శులను నియమిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు విష్ణునాథ్, విశ్వనాథన్‌ను, ఏపీకి గణేశ్ కుమార్ యాదవ్‌ను నియమించారు. మాజీ ఎమ్మెల్యే సంపత్‌ను ఛత్తీస్‌గఢ్ ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. వెంటనే వీరి నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News September 13, 2024
కెనడాలో ఖలిస్థానీల బాంబు దాడి: పంజాబ్‌లో NIA సోదాలు
కెనడాలోని భారత హైకమిషన్‌పై ఖలిస్థానీ సపోర్టర్ల బాంబు దాడి కేసులో NIA పంజాబ్‌లో సోదాలు చేపట్టింది. ఉదయం నుంచే అధికారులు కొందరి ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ చేస్తున్నారని తెలిసింది. 2023, మార్చి 23న ఒట్టావాలో హై కమిషన్ ముందు దేశవ్యతిరేక నినాదాలు చేసిన ఖలిస్థానీలు త్రివర్ణ పతాకాలు తొలగించి తమ జెండాలు పాతారు. భవంతిలోకి 2 గ్రెనేడ్లు విసిరారు. దీనిపై నిరుడు జూన్‌లో NIA కేసు నమోదు చేసింది.
News September 13, 2024
హరీశ్ రావుకు వైద్య పరీక్షలు
TG: భుజం గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. నిన్న అరెస్ట్, ఆందోళనల సమయంలో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు తాజాగా ఆయనకు అనుమతినిచ్చారు.
News September 13, 2024
BRS నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండి: కోమటిరెడ్డి
TG: BRS పార్టీ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం, ప్రభుత్వంపై BRS నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే వాళ్ల ఉద్దేశం. పదేళ్లు సెంటిమెంట్‌తో పరిపాలన చేశారు. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్లు ఓట్లేయకపోతే గెలిచేవారా?’ అని ప్రశ్నించారు.