News July 31, 2024
అమరావతి రైల్వేలైన్ భూసేకరణకు అధికారుల నియామకం

AP: అమరావతి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53కి.మీ మేర నిర్మించే ఈ లైన్ భూసేకరణ కోసం అధికారులను రైల్వేశాఖ నియమించింది. గుంటూరు జిల్లా పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో గుంటూరు జేసీ, NTR(D) ఇబ్రహీంపట్నంలో విజయవాడ RDO, కంచికచర్ల, వీరులపాడులో నందిగామ RDO, పల్నాడు(D) అమరావతిలో సత్తెనపల్లి RDOకు భూసేకరణ బాధ్యతలను అప్పగించింది.
Similar News
News November 28, 2025
పాత ఫొటోలకు కొత్త రూపం.. ట్రై చేయండి!

పాడైపోయిన, క్లారిటీ కోల్పోయిన చిన్ననాటి ఫొటోలను HD క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. ‘జెమినీ AI’ను ఉపయోగించి అస్పష్టంగా ఉన్న చిత్రాలను అప్లోడ్ చేసి, సరైన ప్రాంప్ట్‌తో డిజిటల్ SLR నాణ్యతకు మార్చవచ్చు. ఇది గీతలు, మసకబారడం వంటి లోపాలను సరిచేస్తూ, రూపురేఖలను చెక్కుచెదరకుండా ఉంచి, మీ జ్ఞాపకాలను సజీవంగా అందిస్తుంది. ఈ <
News November 28, 2025
పీసీఓఎస్ ఉందా? ఇలా చేయండి

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రధాన సమస్య బరువు. ఎంత కడుపు మాడ్చుకున్నా, వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్, ప్రొటీన్ ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి. అవకాడో, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, నట్స్.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు వ్యాయామాలు, తగినంత నిద్ర ఉండాలి.
News November 28, 2025
2,757 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2,757 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 18 వరకు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com


