News September 19, 2024
మూడు జిల్లాలకు YCP అధ్యక్షుల నియామకం
AP: మరో మూడు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించింది. శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం-శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా తమ్మినేని సీతారాంను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News October 5, 2024
టమాటా ధర రూ.73 దాటింది, ఎప్పుడు తగ్గిస్తారో చెప్పండి?: YCP
AP: తాను వచ్చాక ధరలు తగ్గిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలను నట్టేట ముంచారని YCP విమర్శించింది. ‘ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న. బాబు వచ్చాక ప్రజలు బతికే పరిస్థితి లేదు. అన్ని ధరలూ ఆకాశాన్ని అంటాయి. కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. టమాటా రూ.73 దాటింది. పేదలు కొనలేక, తినలేక అవస్థలు పడుతున్నారు. ప్రజలను పక్కదారి పట్టించడం మానేసి ధరలు ఎప్పుడు తగ్గిస్తారో చెప్పండి?’ అని ప్రశ్నించింది.
News October 5, 2024
నిరాహార దీక్షకు ఆర్‌జీ కర్ వైద్యుల నిర్ణయం
కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యులు 24గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తాజాగా ప్రకటించారు. ఓవైపు తమ విధులు నిర్వహిస్తూనే ధర్మతల మెట్రో ఛానల్ ప్రాంతంలో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. దుర్గాపూజ సమయంలోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించడంపై ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు తీసుకోకుంటే వైద్య సేవల్ని మళ్లీ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
News October 5, 2024
హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల
TG: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. HYDలో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.