News October 19, 2024
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం
AP: వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా-కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు-వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మడి కృష్ణా-ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలు-బొత్స సత్యనారాయణ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కో ఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని నియమించింది.
Similar News
News November 2, 2024
నా సలహా ఫీజు రూ.వంద కోట్లు: ప్రశాంత్ కిశోర్
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ఫీజు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.100 కోట్లు. అవును ఏదైనా రాష్ట్రంలో అక్కడి పార్టీకి సలహాలు ఇచ్చినందుకు రూ.వంద కోట్లు తీసుకుంటారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. బిహార్‌లో త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా బెలగంజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పది రాష్ట్రాల్లో తాను సలహాలు ఇచ్చిన ప్రభుత్వాలే గెలిచినట్లు తెలిపారు.
News November 2, 2024
పనిలో ఏకాగ్రత పెరగాలంటే?
ఉద్యోగంలో ఏకాగ్రత లోపిస్తోందా? రోజూ 8-9 గంటలు పనిచేస్తుండటంతో నిద్రమత్తు కమ్మేస్తోందా? ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కొన్ని చిట్కాలను వైద్యులు తెలియజేశారు. సుదీర్ఘ పని రోజుల్లో శ్రద్ధ, దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి ఇలా చేయండి. పని మధ్యలో శారీరక శ్రమ కోసం 10 నిమిషాలు నడవండి. ఫ్రెండ్స్‌తో కాఫీకి వెళ్లి రండి. సూర్యరశ్మి, ప్రకృతితో ఓ పది నిమిషాలు గడపండి. 10-20 నిమిషాలు చిన్న కునుకు తీయండి.
News November 2, 2024
ALERT.. కాసేపట్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.