News February 19, 2025

నిన్న నియామకం.. నేడు కోర్టు విచారణ

image

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక నిబంధనల మార్పుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. గతంలో CJI, ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానెల్ CEC, ECలను నియమించేది. ఇందులో నుంచి CJIని తొలగిస్తూ, ఒక కేంద్రమంత్రిని చేరుస్తూ NDA ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారమే జ్ఞానేశ్ కుమార్‌ను CECగా కేంద్రం సోమవారం అర్ధరాత్రి నియమించింది. కేంద్రం తీరును ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.

Similar News

News March 23, 2025

క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

image

క్రెడిట్ కార్డుల వాడకం ఇటీవల ఎక్కువైంది. అయితే చెల్లింపుల ఊబిలో చిక్కుకున్నవారు కార్డు క్లోజ్ చేస్తుంటారు. అది మంచిది కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడమనేది మన ఆర్థిక పరిస్థితి బాలేదనే విషయాన్ని సూచిస్తుంది. దాంతో సిబిల్ స్కోర్‌ తగ్గే అవకాశముంది. ఒకవేళ కార్డు నిలిపేయడం తప్పనిసరైతే మరో క్రెడిట్ కార్డు తీసుకున్నాక దీన్ని క్లోజ్ చేసుకోవడం బెటర్’ అని వివరిస్తున్నారు.

News March 23, 2025

ప్రాక్టీస్ ఫొటోలు షేర్ చేసిన SRH

image

ఈ సీజన్‌లో SRH తొలి మ్యాచ్ మరో మూడు గంటల్లో మొదలు కాబోతోంది. రాజస్థాన్‌పై గెలిచి హోంగ్రౌండ్ తొలి మ్యాచ్‌తోనే ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇవ్వాలని ప్లేయర్స్ కసరత్తు చేస్తున్నారు. టీమ్ ప్రాక్టీస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన SRH మేనేజ్మెంట్.. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆటగాళ్ల దృఢ సంకల్పం కన్పిస్తోందని కామెంట్ చేసింది. అటు స్టేడియానికి ఫ్యాన్స్ తాకిడి మొదలవగా ఉప్పల్ పరిసరాల్లో కోలాహలంగా ఉంది.

News March 23, 2025

వచ్చే నెలలో ముహూర్తాల జాతర

image

ఏప్రిల్ నెలలో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరగనున్నాయి.

error: Content is protected !!