News July 5, 2024

APPSC డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల

image

AP: వివిధ విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టు షెడ్యూల్‌ను APPSC విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. అలాగే మెడికల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 15, 2025

హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు: మంత్రి

image

శ్రీ సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సవిత ఆదేశించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్‌తో ఆదివారం మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. హాస్టల్‌లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుపై రావడానికి కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఆదేశించారు.

News December 15, 2025

పలాసను జిల్లాగా ప్రకటించాలి: మాజీ కేంద్రమంత్రి

image

పలాసను కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై అన్ని పార్టీ నాయకులు కలిసికట్టుగా సహకరించాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి.కృపారాణి పేర్కొన్నారు. ఆదివారం టెక్కలిలోని ఆమె కార్యాలయంలో పలాస జిల్లా సాధన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా పలాస జిల్లా ఏర్పడితే మొట్టమొదటిగా లాభపడేది ఇచ్ఛాపురం నియోజకవర్గమేనని, వారి సహకారం అవసరమన్నారు. పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.