News April 25, 2024
ఈ నెల 25న ఏపీఆర్జేసీ, డీసీ సెట్ పరీక్షలు

AP: ఈ నెల 25న APRJC, డీసీసెట్-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అలాగే డీసీ సెట్‌కు 56,949 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి రేపు మ.2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
Similar News
News December 13, 2025
సినిమా అప్డేట్స్

✦ ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్
✦ నేడు మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ రిలీజ్ డేట్ ప్రకటనతోపాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
✦ నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ బుకింగ్స్‌లో $100K మార్క్‌ను దాటేసిన ‘రాజాసాబ్’
✦ తెలుగులోకి రీమేక్ కానున్న హాట్‌స్టార్ హిందీ వెబ్‌సిరీస్ ‘ఆర్య’.. ప్రధాన పాత్రలో కాజల్?
News December 13, 2025
గురుకుల స్కూళ్లలో అడ్మిషన్లు.. అప్లై చేసుకోండిలా

TG: ప్రభుత్వ రెసిడెన్షియల్ (గురుకుల) స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5-9 తరగతుల్లో అడ్మిషన్లకు ప్రభుత్వం TGCET నిర్వహించనుంది. ఈ పరీక్షకు అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం <
News December 13, 2025
IIBFలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్(IIBF)లో 17 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iibf.org.in


