News April 25, 2024

ఈ నెల 25న ఏపీఆర్జేసీ, డీసీ సెట్ పరీక్షలు

image

AP: ఈ నెల 25న APRJC, డీసీసెట్-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అలాగే డీసీ సెట్‌కు 56,949 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి రేపు మ.2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News January 22, 2026

ట్రంప్‌కు EU కౌంటర్.. ట్రేడ్ డీల్ ఫ్రీజ్

image

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలన్న US అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరికి EU కౌంటరిచ్చింది. యూరప్ దేశాలపై ఆయన సంధించిన టారిఫ్స్ అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. USతో ట్రేడ్ డీల్‌కు ఆమోదం తెలపకుండా EU పార్లమెంట్ ఫ్రీజ్ చేసింది. డీల్‌లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్స్ ఎత్తేసేందుకు ఓటింగ్ జరపాల్సి ఉంది. కానీ ట్రేడ్ డీల్ నిలిపివేయడంతో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు.

News January 22, 2026

జనవరి 22: చరిత్రలో ఈ రోజు

image

1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1885: ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
2014: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (ఫొటోలో)

News January 22, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.