News April 12, 2025
ఏప్రిల్ 12: చరిత్రలో ఈరోజు

1917: భారత మాజీ క్రికెటర్ వినూమన్కడ్ జననం
1961: అంతరిక్షానికి తొలిసారిగా మనిషి ప్రయాణం (యూరీ గగారిన్)
1962: ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం
1981: ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ షటిల్ ‘కొలంబియా’ ప్రయోగం
2006: కన్నడ నటుడు రాజ్‌కుమార్ మరణం
* రోదసి దినోత్సవం
Similar News
News April 20, 2025
Google: భారీగా భారత ఉద్యోగుల తొలగింపు!

గూగుల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసుల్లోని వందలాది మంది ఎంప్లాయిస్‌కు లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచే జాబ్ కట్స్ మొదలవ్వొచ్చని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ టీమ్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.
News April 20, 2025
కాబోయే భార్య వేధింపులు.. అధికారి సూసైడ్

కాబోయే భార్య వేధింపులు తాళలేక ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్న ఘటన MHలో జరిగింది. నాసిక్‌కు చెందిన హరేరామ్(36), వారణాసి యువతి మోహినికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసి హరేరామ్ నిలదీశాడు. విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించింది. మానసిక ఒత్తిడికి లోనైన హరేరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి, ఆమె లవర్‌పై కేసు నమోదైంది.
News April 20, 2025
డీలిమిటేషన్‌కు మేం వ్యతిరేకం కాదు: స్టాలిన్

డీలిమిటేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, న్యాయబద్ధంగా చేయాలనే కోరుతున్నామని తమిళనాడు CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘త్వరలో జరగబోయే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలా చేస్తే సౌత్ స్టేట్స్‌కు నష్టం. వాయిదా వేసి సమన్యాయం జరిగేలా చూడాలంటున్నాం. హిందీ వల్ల నార్త్‌లో ఎన్నో రాష్ట్రాలు మాతృ భాషను కోల్పోయాయి. TNలో ఆ పరిస్థితి రానివ్వం’ అని వ్యాఖ్యానించారు.