News April 12, 2024
ఏప్రిల్ 12: చరిత్రలో ఈరోజు

1917: భారత మాజీ క్రికెటర్ వినూమన్కడ్ జననం
1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవునిగా నిలిచాడు
1962: ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం
1981 : ప్రపంచపు మొట్టమొదట స్పేస్ షటిల్ ‘కొలంబియా’ను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది
2006: కన్నడ నటుడు రాజ్‌కుమార్ మరణం
* ప్రపంచ రోదసీ దినోత్సవం
Similar News
News March 21, 2025
EPFO నూతన ఉద్యోగుల వివరాలు తెలిపిన కార్మిక శాఖ

ఈ ఏడాది జనవరిలో ఈపీఎఫ్‌ఓలో నికరంగా 17.89లక్షల మంది నూతన చందాదారులు చేరినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 11.47శాతం అధికమని తెలిపింది. కొత్తగా చేరిన వారిలో18-25 ఏళ్లవారు దాదాపు 4.7 లక్షలమంది ఉన్నారు. జనవరిలో కొత్తగా చేరిన మహిళా సభ్యులు 2.17 లక్షల మంది ఉండగా గతేడాదితో పోలిస్తే 6.10 శాతం పెరిగారు.
News March 21, 2025
శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు ఫ్యామిలీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మంత్రి లోకేశ్‌తో సహా కుటుంబసభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు.
News March 21, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

TG: నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. ALL THE BEST.