News April 15, 2025
ఏప్రిల్ 14 ఇకపై అంబేడ్కర్ దినోత్సవం: న్యూయార్క్

న్యూయార్క్‌లో ఇకపై ఏప్రిల్ 14ను అంబేడ్కర్ దినోత్సవంగా జరపనున్నారు. నగర మేయర్ కార్యాలయ డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా భారత కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రసంగించారు. అనంతరం ఆయన సమక్షంలో చౌహాన్ ఈ ప్రకటన విడుదల చేశారు. బాబాసాహెబ్ సిద్ధాంతాలు కాలానికి, సరిహద్దులకు అతీతమని ఈ సందర్భంగా కొనియాడారు.
Similar News
News December 4, 2025
రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 4, 2025
పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్‌లైన్స్

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్‌లైన్స్‌ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.
News December 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 86

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


