News April 15, 2025
ఏప్రిల్ 14 ఇకపై అంబేడ్కర్ దినోత్సవం: న్యూయార్క్

న్యూయార్క్‌లో ఇకపై ఏప్రిల్ 14ను అంబేడ్కర్ దినోత్సవంగా జరపనున్నారు. నగర మేయర్ కార్యాలయ డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా భారత కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రసంగించారు. అనంతరం ఆయన సమక్షంలో చౌహాన్ ఈ ప్రకటన విడుదల చేశారు. బాబాసాహెబ్ సిద్ధాంతాలు కాలానికి, సరిహద్దులకు అతీతమని ఈ సందర్భంగా కొనియాడారు.
Similar News
News April 25, 2025
అల్లు అర్జున్ సినిమాలో మృణాల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీకి నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.
News April 25, 2025
పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. షా ఆదేశాలు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేేపట్టారు.
News April 25, 2025
ఆర్మీ కంటపడ్డాడు.. ఖతమయ్యాడు

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత సైన్యం <<16209767>>మట్టుబెట్టిన<<>> విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి నిందితుల కోసం ఆర్మీ, J&K పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా అల్తాఫ్ వారి కంటపడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీ ఫైరింగ్‌లో అల్తాఫ్ హతమయ్యాడు. అటు కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఆర్మీ చీఫ్ ద్వివేది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.