News April 25, 2024

ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

image

1929: ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ జననం
1934: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం
1969: ప్రఖ్యాత జ్యోతిష శాస్త్ర పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం
1973: లెజెండరీ క్రికెటర్ సచిన్ జననం
1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత దేశంలో పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది
2011: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం

Similar News

News January 24, 2025

ఏపీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్.. ఎక్కడంటే?

image

ఏపీలోని భీమవరంలో ఈనెల 26న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సంబరాలను నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ జరగనుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.230కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేశ్ హీరోగా నటించగా, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

News January 24, 2025

రాజ్యసభలో వైసీపీకి బిగ్ షాక్

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది ఎగువసభ సభ్యులు ఉండేవారు. కొద్ది రోజుల క్రితం బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. రేపు రిజైన్ చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.

News January 24, 2025

వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల

image

AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్‌లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.