News April 30, 2024
ఏప్రిల్ 30: చరిత్రలో ఈరోజు
*1870: చలనచిత్ర దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం.
*1891: కవి గాడేపల్లి వీరరాఘవశాస్త్రి జననం.
*1910: కవి శ్రీశ్రీ జననం.
*1945: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మరణం.
*1987: టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ జననం.
Similar News
News November 7, 2024
ట్రూకాలర్ ఆఫీసులపై ఐటీ రైడ్స్
పన్ను ఎగవేత ఆరోపణలపై ట్రూకాలర్ ఆఫీసుల్లో IT అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ ఆఫీసుల్లో తనిఖీలు జరిపారు. పన్ను ఎగవేత సహా, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ (అనుబంధ సంస్థల మధ్య లావాదేవీలు) విషయమై అధికారులు డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా చేసిన తనిఖీలపై అధికారులకు సహకరించినట్టు ట్రూకాలర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
News November 7, 2024
రిజర్వేషన్లను పెంచుతారా?
ప్రస్తుతం తెలంగాణలో బీసీల జనాభా 50% పైగా ఉంది. స్థానిక సంస్థల్లో వీరికి 29% రిజర్వేషన్ అమలవుతోంది. తాము గెలిస్తే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో చెప్పింది. అందులో భాగంగానే ప్రస్తుత రేవంత్ సర్కారు కులగణన సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరుతో సర్వే పూర్తి కానుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ రిజర్వేషన్లను పెంచుతుందా? లేదా? అనేది చూడాలి.
News November 7, 2024
దశలవారీగా సర్పంచుల బాకీలు చెల్లిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
TG: సర్పంచుల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. BRS నేతల రెచ్చగొట్టే మాటలు ఎవరూ నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. సర్పంచులకు చెందాల్సిన నిధులను BRS ప్రభుత్వం దారి మళ్లించలేదా? 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణం కాలేదా? అని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని ఆయన అన్నారు.