News November 4, 2024
దారుణంగా పడిపోయిన AQ.. లాహోర్ ఉక్కిరిబిక్కిరి
పాక్‌లోని లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. అక్కడ AQI రికార్డ్ స్థాయిలో 1900 దాటింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్థానిక స్కూళ్లకు వారం సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించారు. మనదేశంలో AQI అత్యధికంగా ఢిల్లీలో 300పైన నమోదవుతుంటుంది.
Similar News
News December 7, 2024
బిలియనీర్లకు రాయితీలు.. సామాన్యులకు పన్ను పోట్లు: రాహుల్ ఫైర్
బిలియనీర్లకు రాయితీలు ఇస్తున్న కేంద్రం, సామాన్యులకు ఆదాయ పన్ను, ఇతరత్రా పన్నుల రేట్లు పెంచుతూ అన్యాయం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజలపై భారం మోపేలా మోదీ ప్రభుత్వం కొత్త జీఎస్టీ స్లాబ్‌ను తీసుకొస్తోందని పేర్కొన్నారు. గర్బర్ సింగ్ ట్యాక్స్ ద్వారా రోజూ ఉపయోగించే వస్తువులపై అధిక పన్నులు విధించేందుకు సిద్ధపడుతోందని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తుతామన్నారు.
News December 7, 2024
టీవీ చూస్తే జీవితం కాలం తగ్గిపోతుంది: వైద్యులు
ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవన కాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ‘ఓ అధ్యయనం ప్రకారం.. టీవీ చూడనివారితో పోలిస్తే రోజుకు 6గంటల పాటు టీవీ చూసేవారు 5ఏళ్లు తక్కువగా జీవిస్తారని తేలింది. అందువల్ల టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోండి. ఇతర స్క్రీన్లనూ తక్కువ చూడండి. బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనుల్ని కల్పించుకోండి’ అని సూచించారు.
News December 7, 2024
బీజేపీ ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ప్రధాని మోదీ, అదానీపై ఆరోపణల విషయంలో తమ ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థల హస్తం ఉందన్న BJP వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. ఈ రకమైన ఆరోపణలు నిరుత్సాహకరమైనవని పేర్కొంది. కాగా మీడియా సంస్థ OCCRP, రాహుల్ గాంధీతో అమెరికా జట్టుకట్టిందని BJP ఇటీవల ఆరోపించింది. అందువల్లే OCCRP నివేదికలను చూపుతూ అదానీ, మోదీపై రాహుల్ విమర్శలు చేస్తున్నారని కమలం పార్టీ మండిపడింది.