News September 20, 2024
పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడట్లేదు: TN ప్రభుత్వం

AP: తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఏఆర్ డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
ట్రంప్ కంటే మోదీ పవర్‌ఫుల్: ఇయాన్ బ్రెమ్మర్

US అధ్యక్షుడు ట్రంప్ కంటే మన PM మోదీయే చాలా పవర్‌ఫుల్ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ పదవి మరో మూడేళ్లలో పోతుందని.. కానీ మోదీకి దేశంలో తిరుగులేని మద్దతు ఉందని పేర్కొన్నారు. దీంతో మోదీ సంస్కరణలను దూకుడుగా అమలు చేయగలరని, విదేశీ ఒత్తిడి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరని విశ్లేషించారు. ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా బెటర్ పొజిషన్‌లో ఉన్నట్లు తెలిపారు.
News January 23, 2026
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు.. బుమ్రా మ్యాజిక్ ఇదే!

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ బౌలర్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 103W తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. రానున్న T20 WCలో IND బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.
News January 23, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,950 ఎగబాకి రూ.1,46,400గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000గా నమోదైంది.


